![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ అయిదు వారాలు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్నట్టుగా ఉంది. 2.0 అట్టహాసంగా సాగింది. నిన్నటి ఫైర్ స్ట్రామ్ ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ఆరుగురిలో ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఊర మాస్ గా ఉన్నారు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది రమ్య. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ తెలియని వారుండరు. అలేఖ్య చిట్టి పికిల్ ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. ముగ్గురు అక్కాచెలెళ్లు కలిసి పికిల్ బిజినెస్ మొదలు పెట్టారు కానీ అనుకోని కారణాల వల్ల కస్టమర్స్ తో రూడ్ గా మాట్లాడిన ఆడియో బయటకు లీక్ కావడంతో ప్రశంసలు అందుకున్న వాళ్ళు విమర్శలు అందుకున్నారు. మొన్నటిదాకా ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాని షేక్ చేశారు.
రమ్య జిమ్ లో ఫిట్ నెస్ వీడియో చేస్తూ ఫేమ్ సంపాదించుకుంది. అలేఖ్య చిట్టి పికిల్ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు చాలా కాంట్రవర్సీ అయ్యారు. అలాంటి కాంట్రవర్సీ ఉన్నవాళ్ళని బిగ్ బాస్ ఏరికోరి తీసుకొస్తాడని.. ఇప్పుడు రమ్య కూడా అలాంటి కేటగిరినే. రమ్య ఒక మంచి ఐటమ్ సాంగ్ పర్ఫార్మన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తన 'AV(ఏవీ)' ప్లే చేస్తాడు నాగార్జున. అది బిగ్ బాస్ యాజమాన్యం ఎమోషనల్ గా ఎడిట్ చేసారు. తనకి ఉన్న నెగెటివ్ పోవాలని అలా ఎడిట్ చేశారు కానీ తనకున్న నెగెటివ్ ఫేమ్ వల్ల ఈ ఏవి అంతగా ఎమోషనల్ అనిపించదు.
హౌస్ లోకి వెళ్లే ముందు తనకి నాగార్జున ఒక పవర్ ఇచ్చాడు. లగ్జరీ ఫుడ్ పవర్ అంటూ ఒక రెడ్ స్టోన్ నాగార్జున ఇచ్చారు. హౌస్‌లో ఇది ఎప్పుడు కావాలన్నా ఎవరి కోసమైనా వాడొచ్చంటూ నాగ్ చెప్పారు. ఇక హౌస్‌లోకి వెళ్లేముందు ఆరు ట్యాగ్‌లు ఆరుగురు సభ్యులకి ఇవ్వాలన్నారు. ఓవర్ యాక్షన్ శ్రీజకి, సెల్ఫిష్ డీమాన్‌కి, మేనిపులేటర్ రాముకి ఇలా ఎవరి బ్యాడ్జ్ వాళ్లకి ఇచ్చేసింది రమ్య. ముక్కుసూటిగా మాట్లాడే రమ్య హౌస్ లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి మరి.
![]() |
![]() |